Header Banner

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

  Fri May 09, 2025 12:01        Politics

భారతదేశం - పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. భారతదేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్‌ దాడులకు తెగబడుతుండగా... భారత దళాలు వాటిని సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఎయిర్‌పోర్టులలో భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. ఇప్పటికే దేశంలోని 27 ఎయిర్‌పోర్టులను శనివారం ఉదయం వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశంలోని మిగిలిన ఎయిర్‌పోర్ట్‌లలో కూడా కేంద్రం భద్రతను పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్రం అన్ని విమానాశ్రయాలలో భద్రతను పెంచడంతో ఎయిర్ ఇండియా, అకాసా ఎయిర్, ఇండిగోతో సహా అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు వేర్వేరుగా అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రయాణికులు 3 గంటల ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని అభ్యర్థించాయి. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎయిర్‌పోర్టులలోకి ప్రయాణీకుల ప్రవేశంపై ఎటువంటి నిషేధం లేదని ప్రభుత్వం తెలిపింది. ‘‘విమానాశ్రయాలలో మెరుగైన చర్యలపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల దృష్ట్యా భారతదేశం అంతటా ప్రయాణీకులు సజావుగా చెక్-ఇన్, బోర్డింగ్ సాగేలా షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు వారి సంబంధిత విమానాశ్రయాలకు చేరుకోవాలని సూచిస్తున్నాం.

 

ఇది కూడా చదవండి: తిరుమలలో భద్రత కట్టుదిట్టం.. సీవీఎస్ వో కార్యాలయంలో ఈ భేటీ!

 

చెక్-ఇన్ బయలుదేరే సమయానికి 75 నిమిషాల ముందు ముగుస్తుంది’’ అని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఇక, అకాసా ఎయిర్, ఇండిగో విమానయాన సంస్థలు కూడా ఇలాంటి సలహాలను జారీ చేశాయి. ‘‘భారతదేశం అంతటా అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యలు తీసుకున్నందున సజావుగా చెక్-ఇన్, బోర్డింగ్ సాగేందుకు ఫ్లైట్ బయలుదేరడానికి కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము’’ అని తమ ప్రయాణీకులకు అకాసా ఎయిర్ అడ్వైజరీ జారీ చేసింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని విమానాశ్రయాలలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా తనిఖీలు, చర్యలకు అనుగుణంగా మీ ప్రయాణానికి కొంత అదనపు సమయం కేటాయించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మీ అవగాహన, సహకారాన్ని మేము అభినందిస్తున్నాము’’ ఇండిగో సంస్థ పేర్కొంది. ఇక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం... బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలను భద్రతా చర్యలను పెంచాలని ఆదేశించింది. అన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు సెకండరీ లాడర్ పాయింట్ తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టులలోని టెర్మినల్ భవనాలకు సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు. ఈ చర్యల్లో భాగంగా ఎయిర్ మార్షల్‌ను మోహరించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations